గుండెపోటుతో కుప్పకూలిన థాయిలాండ్​ యువరాణి

By udayam on December 16th / 5:44 am IST

థాయిలాండ్​ రాజు మహా వజిరలాంగ్​ కార్న్​ చిన్న కూతురు ప్రిన్సెస్​ బజ్రకితియబ (44) తీవ్ర గుండెపోటుకు లోనయ్యారు. నిన్న ఉదయం కుక్కతో రన్నింగ్​ కు వెళ్ళిన ఆమె మార్గమధ్యంలోనే గుండెపోటుకు గురయి కుప్పకూలారు. దాంతో ఆమె వెంటనే బ్యాంకాక్​ లోని ఆసుపత్రికి హెలికాఫ్టర్​ లో తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు రాజకుటుంబం ప్రకటించింది. రాజు తర్వాత రాణి అయ్యే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఆస్ట్రియా, స్లోవేనియా, స్లోవేకియా దేశాల్లో థాయిలాండ్​ అంబాసిడర్​ గా పనిచేస్తున్నారు.

ట్యాగ్స్​