గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో తుపాను కారణంగా థాయ్ నేవీ షిప్ బోల్తా పడింది. ఈ ఘటనలో 75 మంది నేవీ సిబ్బంది బయటపడగా.. 31 మంది షిప్ లోనే ఉండి సముద్రంలో చిక్కుకుపోయారు.ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ సిబ్బందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని థాయిలాండ్ నేవీ ప్రకటించింది. షిప్‌లోకి నీరు చేరడంతో బోల్తా పడిందని, నౌక అంతా జలమయం అయిపోయిందని, పవర్ రూమ్ షార్ట్ సర్క్యూట్ అయిందని అధికారులు తెలిపారు. విద్యుత్ లేకపోవడంతో, నౌకను కంట్రోల్‌లోకి తీసుకురావడం సిబ్బందికి కష్టమైంది. నౌక ఓ పక్కకు ఒరిగి క్రమంగా నీట మునిగింది.