నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబోలో వస్తున్న థాంక్యూ నుంచి తొలి టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా మారడానికి ఎవరి గురించీ ఆలోచించని వ్యక్తిగా నాగ చైతన్య క్యారెక్టర్‌ను టీజర్లో కట్ చేశారు. ఆపై హీరోయిన్ మాటల వల్ల మారిన అతడు తనను తాను సరిచేసుకునేందుకు జరిపే ప్రయాణమే ఈ మూవీ అంటూ టీజర్లో అసలు విషయాన్ని చెప్పేశారు. చై సరసన రాశి ఖన్నా, మాళవిక నాయిర్, అవికా గోర్లు రొమాన్స్ చేస్తున్నారు. జులై 8న మూవీ విడుదల కానుంది.