4:56 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

నీటి గుంతలో పడి బాలుడి మృతి 2 weeks ago

హైదరాబాద్‌: మియాపూర్‌ నరేన్ గార్డెన్ సమీపంలో నీటిగుంతలో పడి బాలుడు మృతిచెందాడు. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన తరుణ్(13) ఈత కొట్టడానికి నీటి గుంతలో దిగి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు.

వాగులో పడ్డ వ్యక్తి ఆచూకీ లేదు …

కాగా హైదరాబాద్ నగరంలోని బీరంగూడలో వరదల్లో కొట్టుకుపోయిన ఐదు రోజులైనా ఆనంద్ ఆచూకీ ఇంకా లభించలేదు. 15 కిలో మీటర్ల వాగు మొత్తం ఎన్డీఆర్‌ఎఫ్‌ గాలిస్తోంది. మూడు గజ ఈతగాళ్ళ బృందాలు, డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు వాగు చుట్టూ పరిశీలిస్తున్నారు. అయినా ఆనంద్, అతని కారు ఆచూకీ దొరకలేదు. తిరుపతి ప్రసాదం పంచడానికి వెళ్లిన ఆనంద్ వరదల్లో కొట్టుకుపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.