2019లో వేరే నక్షత్రమండలంలోని మెస్సియర్ 87 (ఎం 87) కృష్ణ బిలం ఫొటోను తీసిన నాసా.. తాజాగా మన పాలపుంతలో భూమికి 26 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సాజిటేరియస్ ఎ* అనే బ్లాక్‌హోల్‌ను ఫొటో తీయగలిగారు. దీని ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ. దీని అడ్డుకొలత దాదాపు 6 కోట్ల కి.మీ.లు. ఈ ఫొటోలో మధ్యలో నల్లగా ఉన్న ప్రాంతంలో బ్లాక్‌హోల్ ఉంటుంది. దాని చుట్టూ పసుపు, ఆరెంజ్ కలర్లో ఉన్నది బ్లాక్‌హోల్ గురుత్వాకర్షణతో వెలువడుతున్న వాయువులు.