దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. వరుసగా నాలుగో సెషన్ లో నష్టాలను మూటకట్టుకున్నాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 981 పాయింట్లు పతనమై 59,845కి పడిపోయింది. నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి 17,806కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.82 వద్ద కొనసాగుతుంది.అంబుజా సిమెంట్స్ షేర్ ఏకంగా 8 శాతం నష్టపోయింది. అదానీ పోర్ట్ 4.50 శాతం, అదానీ ఎంటర్ టైన్ మెంట్ 3.89 శాతం, టాటా స్టీల్ 3.86 శాతం నష్టపోయాయి.