ఈ ఏడాది వర్షాకాలం జూన్ 5 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి మే 15 నాటికే అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అసాని తుపాను అలజడి తగ్గడంతో ఎపి, ఒడిశాలలో నేడు 3 నుంచి 4 డిగ్రీల మేర ఎండలు అధికంగా నమోదయ్యాయని ఆ శాఖ వెల్లడించింది. ఒడిశాలో ఈరోజు అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.