ఈ ఏడాది దేశాన్ని హడలించిన ఘటనలు ఇవే

By udayam on December 22nd / 10:08 am IST

దేశాన్ని, ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు 2022 ఏడాదిలో చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్​ దారుణ హత్య అన్నింటికంటే ఎక్కువగా దేశాన్ని వణికించింది. అతడి ప్రియుడు ఆమెను 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. ఆ తర్వాత రష్యా మారణ హోమంలో ఉక్రెయిన్​ లో బయటపడ్డ భారీ శవాల గుట్టల ఫొటోలు ప్రపంచాన్ని వణికించాయి. కేరళలో అక్టోబర్​ మొదట్లో బయటపడ్డ నరబలి కేసు కూడా దేశాన్ని ఉలక్కిపడేలా చేసింది. జపాన్​ ప్రధాని షింబో అబేను ఓ వ్యక్తి షాట్​ గన్​ తో కాల్చి చంపడంతో ప్రపంచం షాక్​ కు గురైంది. గుజరాత్​ లోని మోర్బీ లో ఓ వంతెన కూలి 135 మంది ప్రజలు కన్నుమూయడంతో దేశం మొత్తం మౌనంగా రోదించింది.

ట్యాగ్స్​