కర్ణాటకలోని బెలగావి, నిప్పాని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకుంటామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సిఎం బసవరాజు బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను తమలో కలిపేసుకోవడానికి తామూ ఆలోచిస్తున్నామని చెప్పారు. ‘మా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు చాలా స్పష్టంగా ఉంది. రాజకీయాలతో పబ్బం గడుపుకునే వారి మాటలను ప్రజలు గమనిస్తున్నారు. మేం వాళ్ళలా ఎద్దులం కాదు’ అని బొమ్మై విమర్శించారు.