టాప్​–10 నివాస అనుకూల పట్టణాల్లో ఏపీ నుంచి విశాఖ, విజయవాడ, గుంటూరులకు చోటు

By udayam on January 11th / 9:21 am IST

దేశవ్యాప్తంగా నివాసానికి అనుకూలంగా ఉన్న పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్​ నుంచి మూడు నగరాలకు చోటు దక్కింది. గుంటూరుకు ఆరో స్థానం దక్కగా, విజయవాడకు 8, విశాఖకు 9వ స్థానాలు దక్కినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్​ పర్సెప్షన్​ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాల ద్వారా ఈ సర్వే ను నిర్వహించారు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన మిగిలిన పట్టణాలు.

ట్యాగ్స్​