గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో లోపం తలెత్తింది. గురువారం అహ్మదాబాద్ జిల్లా బవ్లా గ్రామం వద్ద ర్యాలీలో పాల్గొన్న ప్రధానిని.. డ్రోన్ కెమెరా సాయంతో వీడియో తీసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన నేపధ్యంలో ప్రైవేటు డ్రోన్లను ఎగురవేయడం ఈ ప్రాంతంలో బ్యాన్ విధించినా వారు భారీ ఎత్తున గుమిగూడిన జనాన్ని తమ కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి వారిపై ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.