ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డిగా ధియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతున్న బాలయ్య.. ఈ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ మూడు పాత్రలలో ఒకటి గ్రామపెద్దగా కనిపించగా, మరొకటి మోడ్రన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మరో లుక్‌ని మూవీ మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచారు. అది బిగ్ స్క్రీన్స్‌పై మాత్రమే రివీల్ అవుతుంది అని సమాచారం. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది.