జాతీయ పక్షిని తాకినా బర్డ్‌ఫ్లూ

మహారాష్ట్రలో 5 నెమళ్లు మృతి

By udayam on January 23rd / 12:02 pm IST

ఔరంగాబాద్: దేశంలో పలుచోట్ల బర్ద్ ఫ్లూ కలకలం రేగుతూనే ఉంది. తాజాగా మరోసారి మహారాష్ట్రలో పలుచోట్ల బర్డ్‌ఫ్లూ కేసులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఐదు నెమళ్లు సహా ఆరు పక్షులు మృత్యువాత పడ్డాయి.

రాష్ట్రంలోని బీద్ జిల్లా లోనీ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.

శిరూర్ కేసర్ తాలూకా బాలాఘాట్ పర్వత శ్రేణులను ఆనుకుని ఈ ప్రాంతం ఉంటుంది. శిరూర్‌కేసర్ తాలూకాలో ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు 21 కాకులు చనిపోయినట్టు గుర్తించారు.

తాజాగా చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్టు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెల్లడించారు. తదుపరి చర్యల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టు తెలిపారు.