దీపావళికి ఓటిటి లో 3 తమిళ సినిమాలు

By udayam on October 28th / 5:51 am IST

దీపావళికి ప్రతీ ఏడాది థియేటర్స్‌లోకి సినిమాలు రిలీజ్ అవ్వడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ‌పండగలకు కొత్త విడుదల ఇబ్బందిగా మారింది. ఇంకా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పడం కష్టం. ఇప్పటికే పలు భాషల్లో  సినిమాలు ఓటిటి వేదికగా రిలీజవ్వడం తెల్సిందే. కొన్ని సినిమాలు మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకు న్నాయి. ఇక తమిళంలో ఈ దీపావళికి మూడు పెద్ద సినిమాలు ఓటీటీల్లో విడుదల కాబోతున్నాయి.

హీరో సూర్య నటించిన సూరరై పోట్రు ( ‘ఆకాశమే నీ హద్దురా!’) నవంబర్‌ 12 నుంచి అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. తక్కువ ఖరీదులోనే పేదవాడు కూడా విమానయానం చేయొచ్చనే  కల కని నిజం చేసుకున్న పైలెట్‌ పాత్రలో సూర్య నటించి, స్వయంగా నిర్మించాడు.  సుధా కొంగర దర్శకత్వం వహించాడు.  తమిళంలో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న భారీ చిత్రమిదే.

‘జయం’ రవి హీరోగా నటించిన  ‘భూమి’ మూవీ దీపావళి రోజు సాయత్రం సన్‌టీవీలో ప్రసారం కానుంది.  అలాగే సన్‌ నెక్ట్స్‌లోనూ ఈ సినిమా ప్రసారం కానుంది. రవి  కెరీర్‌లో 25వ మూవీగా తెరకెక్కిన ఇందులో  ఇస్మార్ట్‌ బ్యూటీ నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించింది.  రైతు ఆత్మహత్యలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ సినిమా తీశారు.

స్టార్ హీరోయిన్ నయనతార అమ్మవారి పాత్రలో  తెరకెక్కిన ‘మూకుత్తి అమ్మన్‌’ నవంబర్‌ 14 నుంచి ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.  తెలుగులో ‘అమ్మోరు తల్లిగా’ విడుదల కానుంది. ఆర్జే బాలాజీ, యన్జే శ్రవణన్‌ దర్శకత్వం వహించాడు.  మతం అనేది అందర్నీ సరైన మార్గంలో నడిపించడానికి ఉన్నప్పటికీ  ఈ నమ్మకాన్ని తప్పు దోవలో పట్టించాలనే ప్రయత్నం చేసే కొందర్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆ అమ్మవారే దిగి వస్తే? అనే  కథాంశంతో ఈ మూవీ తెరకెక్కించారు.