షూటింగ్ పూర్తి చేసుకుని మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న తమిళ అగ్రనటుడు అజిత్ మూవీ తునివు (తెలుగులో తెగింపు) ట్రైలర్ డేట్ లాక్ అయింది. ఈనెల 31న ఈ మూవీ ట్రైలర్ ను అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.