కాకినాడలో పెద్దపులి జాడలు

By udayam on May 31st / 5:08 am IST

కొద్ది రోజుల క్రితం కాకినాడ జిల్లాలో జనావాసాల మధ్య కనిపించిన పులిని పట్టుకోవడానికి ఎపి ఫారెస్ట్​ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లా ఫారెస్ట్​ అధికారి ఐకెవి.రాజు ఆధ్వర్యంలో ఇప్పటికే 150 మంది సిబ్బంది దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి విశాఖపట్నం జూ అధికారులు సైతం సహకారం అందిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలోని పోతులూరు గ్రామం వద్ద దీనిని తొలిసారిగా గుర్తించడంతో ఇక్కడి ప్రజలు పగలు, రాత్రిళ్ళు సైతం ఇళ్ళకే పరిమితమవుతున్నారు.

ట్యాగ్స్​