రాష్ట్రాన్ని ధరణి పోర్టల్ ను వాడుకుంటూ దోచేస్తున్న టిఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు కుటుంబ వాదాన్ని వ్యాపింపజేయడానికి బిఆర్ఎస్ పార్టీ పెట్టారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడిన నడ్డా.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తనకోసం ఫాంహౌస్ కట్టుకున్న కేసీఆర్.. ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు.