వెంకన్నకు ఒక్కరోజులే రూ.7.68 కోట్ల ఆదాయం

By udayam on January 3rd / 12:23 pm IST

తిరుమల వెంకన్నకు రికార్డు ఆదాయం దక్కింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో వడ్డి కాసుల వాడి ఆదాయం ఒక్కరోజులో రెట్టింపైంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి రూ.7.68 కోట్ల ఆదాయం దక్కింది. గతేడాది అక్టోబర్​ 23న వచ్చిన రూ.6.31 కోట్లే ఇప్పటి వరకూ నమోదైన ఒకరోజు అత్యధిక ఆదాయం కాగా.. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

ట్యాగ్స్​
TTD