2022 కు గాను తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు వచ్చాయి. గడిచిన రెండేళ్లు కరోనా కారణంగా భక్తులు పెద్దగా దర్శనానికి ఇంట్రస్ట్ చూపించలేదు. దీంతో ఈ రెండేళ్లు శ్రీవారి ఆదాయం బాగా తగ్గింది. కానీ 2022 కరోనా తగ్గుముఖం పట్టడం , కరోనా ఆంక్షలు కూడా లేకపోవడం తో వివిధ రాష్ట్రాల నుండి శ్రీవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. దీంతో శ్రీవారి ఆదాయం కూడా భారీ ఎత్తున వచ్చింది. ఈ ఏడాది స్వామి వారిని 2.35 కోట్ల మంది దర్శించుకోగా 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 11.42 కోట్ల లడ్డూ విక్రయాలు జరగ్గా..స్వామి వారికి 1756 గ్రాముల బంగారు ఆభరణాలు వచ్చాయి.