వైకుంఠ ఏకాదశి : భక్తులతో పోటెత్తిన తిరుమల

By udayam on January 2nd / 5:02 am IST

తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు కొండకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశినాడు స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అర్ధరాత్రి 1.45 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తోంది టిటిడి. మహారాష్ట్ర సిఎం ఏక్ నాథ్ షిండే, మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ్, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నటుడు రాజేంద్రప్రసాద్​, మాజీ మంత్రి అవంతి, తెలంగాణ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రలు స్వామివారి దర్శనానికి వచ్చారు.

ట్యాగ్స్​