తమిళనాడు: స్టాలిన్​ దెబ్బకు వాకౌట్​ చేసిన గవర్నర్​

By udayam on January 10th / 5:35 am IST

తమిళనాడు శాసనసభను ఉద్దేశించి తొలిరోజు చేసే ప్రసంగంలో ‘అంబేద్కర్‌, ద్రవిడ నేతలు, ద్రవిడ పాలన’ను ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రస్తావించకపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై సిఎం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గవర్నర్‌ సోమవారం అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వాకౌట్‌ చేశారు. శాసనసభను ఉద్దేశించి గవర్నర్​ చేసే సాంప్రదాయ ప్రసంగం నుండి కొన్ని భాగాలను వదిలేయడంతో స్టాలిన్​ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమోదించబడిన ప్రసంగ పాఠం నుండి గవర్నర్‌ ఒక పేరాగ్రాఫ్‌ను చదవకుండా వదిలిపెట్టడమే ఈ పరిస్థితికి కారణమైంది.

ట్యాగ్స్​