తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరో వివాదానికి ఆజ్యం పోశారు. రాజ్‌భవన్‌లో జరిగే సంక్రాంతి వేడుకలకు హాజరవ్వాలంటూ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఆహ్వానపత్రిక పంపారు. అయితే తమిళ నాడు ప్రభుత్వం బదులుగా ‘తమిళగం అజునర్ ‘ అని ఆహ్వాన పత్రికలో పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. గవర్నర్ ఆహ్వాన పత్రికలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నానికి బదులుగా కేంద్ర ప్రభత్వ చిహ్నం ఉండటం గమనార్హం. ఆంగ్ల వెర్షన్‌లో రాష్ట్ర గవర్నర్ పేరు రాశారు. తమిళనాడుని తమిళగం అంటూ గతంలో వ్యాఖ్యానించడంపై వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.