సీనియర్​ నిర్మాత రామకృష్ణా రెడ్డి మృతి

By udayam on May 26th / 6:33 am IST

టాలీవుడ్​ సీనియర్​ నిర్మాతల్లో ఒకరైన ఎం.రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 1973లో ఆయన తీసిన తొలి చిత్రం అభిమానవంతులు సూపర్​ హిట్​ కొట్టడంతో ఆపై వరుసగా చిత్రాలను నిర్మించారు. వైకుంఠపాళి, గడుసుపిల్లోడు, సీతాపతి సంసారం, మావూరి దేవత, అల్లుడు గారు జిందాబాద్​, అగ్ని కెరటాలు వంటి చిత్రాలను ఆయనే నిర్మించారు. ఆయన మృతిపై టాలీవుడ్​ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్​