22 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్!

By udayam on August 18th / 9:56 am IST

ఆగస్ట్‌ 1 నుంచి నిలిచిపోయిన టాలీవుడ్ షూటింగ్స్ వారంలోనే తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి. దీనిపై ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ నేడు ప్రకటన చేయనుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై ఈ ప్రకటనలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్‌,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్‌1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా మూడు సినిమాలు హిట్‌ కావడం, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ట్యాగ్స్​