ఎపిలో సెంచరీ కొట్టిన టమాటో ధర

By udayam on November 24th / 7:16 am IST

ఆంధ్రప్రదేశ్​లో టమాటా ధరలు పెట్రోల్​ ధరలతో పోటీ పడుతున్నాయి. ప్రతీ చలికాలంలోనూ కేవలం కిలో రూ.20 పలికే టమాటా.. ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, తమిళనాడుల్లో వచ్చిన వరదల కారణంగా పంట నష్టం ఏర్పడి వాటి ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.100ను దాటేసింది. ఈ నెల మొదట్లో కిలో రూ.40 పలికిన ధర ప్రస్తుతం కొన్ని చోట్ల రూ.140కు చేరుకుంది. దాంతో పాటు క్యాప్సికమ్​, ఉల్లిపాయల ధరలు కూడా పెరిగాయి.

ట్యాగ్స్​