దేశవ్యాప్తంగా టమాటా ధరలు మళ్ళీ ఆకాశాన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేజీ టమాటా రూ.100 మార్క్‌ను చేరుకుంటోంది. ఒడిశాలో రూ.90 గా ఉన్న టమాటా.. కర్ణాటకలో రూ.70కు, తెలుగు రాష్ట్రాల్లో రూ.60కు చేరుకుంది. మండిపోతున్న ఎండలకు దిగుబడి లేకపోవడం తోడై టమాటా ధరలు పైపైకి చేరుకుంటున్నాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. ఇటీవల వచ్చిన అసాని తుపాను కూడా టమాటా దిగుబడి తగ్గుదలకు కారణమని తెలిపింది.