దేశంలో పలు బ్యాంకులను మోసం చేసిన టాప్ 50 మందిలో మోహుల్ చోక్సీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంట్ లో వెల్లడించింది. టాప్ 50 లో ఉన్నవారంతా బ్యాంకులకు ఏకంగా రూ.92,570 కోట్లు ఎగ్గొట్టినట్లు అంకెలతో సహా వెల్లడించింది. వీరిలో రూ.7,848 కోట్లతో డైమండ్ వ్యాపారి మోహుల్ చోక్సీ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అతడి తర్వాత ఎరా ఇన్ఫా రూ.5879 కోట్లు, రైగో ఆగ్రో రూ.4803 కోట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నా,రు. కాంకాస్ట్ స్టీల్ అండ్ పవర్ రూ.4596 కోట్లు, ఎబిజి షిప్ యార్డ్ రూ.3708 కోట్లు ఎగవేశాయి.