దేశంలో అమ్ముడవుతున్న కొన్ని రకాల వంటనూనెలపై పన్నుల శాతాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధం, మరో వైపు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి చర్యలతో దేశంలో మండిపోతున్న నూనె ధరలపై పన్నులను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని నిర్ణయించింది. ముడి పామాయిల్ దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్‌ను తగ్గించాలని ఆలోచిస్తోంది. భారత్ తన వంటనూనె అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది.