9 నుంచి 11 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

By udayam on December 7th / 6:36 am IST

ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 10, 11 తేదీల్లో ఇండియన్​ రేసింగ్​ నిర్వహించనున్న నేపధ్యంలో హైతరాబాద్​ నుంచి ఐమ్యాక్స్​, తెలుగుతల్లి కూడలి వైపు వెళ్ళే మార్గాలను మూసేయనున్నట్లు ట్రాఫిక్​ విభాగం ప్రకటించింది. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా-ఈ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌ ట్రయల్స్​ ను ఇటీవలే నిర్వహించినప్పటికీ కొత్త ట్రాక్​ పై కార్లు యాక్సిడెంట్లకు గురవ్వడంతో అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో ఇప్పుడు మరోసారి 2 రోజుల పాటు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్​