కేబుల్​ టీవీ కి కొత్త టారిఫ్‌ ను తీసుకొచ్చిన ట్రాయ్​

By udayam on November 23rd / 12:33 pm IST

భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌.. కేబుల్‌ టీవీ కొత్త టారిఫ్‌ ఆర్డర్ ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2020లోనే టారిఫ్‌ ఆర్డర్‌ను ప్రకటించినా.. వాటిపై బ్రాడ్‌కాస్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.టారిఫ్‌ ఆర్డర్‌ 2.0లో బొకేలోని చానళ్ల గరిష్ఠ ధర 12 రూపాయ‌ల‌కు మించరాదంటూ పరిమితి విధించారు.తాజా సవరణల్లో ఆ పరిమితిని 19 రూపాయ‌ల‌కు పెంచారు. కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ 2.0 వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుంది.

ట్యాగ్స్​