15 నుంచి పాపికొండలకు బోట్​ సర్వీస్​

By udayam on April 14th / 6:39 am IST

2019లో జరిగిన ఓ ప్రైవేట్​ బోట్​ ప్రమాదం తర్వాత మూతపడ్డ పాపికొండల బోట్​ సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తిరిగి ప్రారంభించనుంది. సింగనపల్లి, పాపికొండలు మధ్య ఈనెల 15న ముందుగా ఓ బోటుతో ట్రయల్​ రన్​ ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్​ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ డివిజనల్​ మేనేజర్​ తోట వీర నారాయణ మాట్లాడుతూ హరిత బోట్​ సర్వీసుల్ని మాత్రమే ముందుగా రన్​ చేయనున్నామని తెలిపారు. ట్రయల్​ రన్​ సక్సెస్​ అయిన తర్వాత కమర్షియల్​ సర్వీసులను పునరుద్దరిస్తామని తెలిపారు.

ట్యాగ్స్​