ఝార్ఖండ్​: దళిత మహిళను 50 ముక్కలుగా నరికి హత్య

By udayam on December 19th / 6:59 am IST

దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్యోదంతాన్ని మరవక ముందే అదే తరహాలో మరో దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. సాహెబ్‌గంజ్‌ జిల్లా బోరియా పోలీసు స్టేషన్‌ పరిధిలో రుబికా పహాదిన్‌ (23) అనే గిరిజన మహిళను దాదాపు 50కి పైగా ముక్కలుగా నరికి హత్య చేశారు. కష్టసుఖాల్లో తోడుగా నిలువాల్సిన భర్తే మరికొందరు దుండగులతో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త దిల్దార్‌ అన్సారీని అరెస్టు చేసి మిగిలిన దుండుగుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్​