త్రివిక్రమ్​కు రూ.15 కోట్ల రెమ్యునరేషన్​!

By udayam on November 27th / 6:11 am IST

పవన్​ కళ్యాణ్​ తాజా చిత్రం భీమ్లా నాయక్​కు అన్నీ తానై నడిపిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ అందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్​ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒరిజినల్​ కథలో మార్పులు చేయడం, స్క్రీన్​ ప్లేతో పాటు మాటలు, ఓ పాట కూడా రాసిన త్రివిక్రమ్​ ఇందుకు గానూ రూ.15 కోట్లతో పాటు సినిమా లాభాల్లో వాటాను కూడా కోరినట్లు అందుకు నిర్మాతలూ అంగీకరించినట్లు తెలుస్తోంది. పవన్​ కళ్యాణ్​ ఈ చిత్రానికి రూ.50 కోట్లు ఛార్జ్​ చేయగా మిగతా నటులు నిత్యా మీనన్​, రానా దగ్గుబాటి, మ్యూజిక్​ డైరెక్టర్​ తమన్​లు కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్లు అందుకున్నారు.

ట్యాగ్స్​