అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అస్సాంలో పుట్టాడంటూ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ భాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్లో నవ్వులపాలయ్యాయి. అస్సాంలోని బార్ పేట్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. నిన్నటి ఫైనల్ మ్యాచ్ తర్వాత మెస్సీని అభినందిస్తూ ట్వీటేశారు. ‘నీకు అస్సాంతో ఉన్న సంబంధానికి గర్విస్తున్నా’ అంటూ ఆ ట్వీట్ లో ఎంపీ రాసుకురావడమే ఇప్పుడు ట్రోలింగ్ కు కారణమైంది. ఈ ట్వీట్ కు పలువురు మెస్సీకి..అస్సాంకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తే.. అస్సాంలోనే పుట్టాడు మెస్సీ.. అంటూ బుదలిచ్చారు ఎంపీ గారు.