వారిసు ట్రైలర్​ టాక్​: అప్పుడే ఫ్యాన్స్​ డీలా పడిపోయారుగా!

By udayam on January 4th / 1:07 pm IST

వంశీ పైడిపల్లి మూవీ అంటేనే.. ఇదొక రొటీన్​ కమర్షియల్​ అని వారిసు ప్రకటించిన వెంటనే ఫిక్స్​ అయిపోయారు హీరో ఫ్యాన్స్​తో పాటు.. రెగ్యులర్​ మూవీ లవర్స్​ కూడా. దానికి తగ్గట్టుగానే వారిసు ట్రైలర్​ కనిపిస్తోంది. ఓ పేద్ద ధనవంతుడు వాడికో జులాయిగా తిరిగే కొడుకు.. వీరిని ఢీకొట్టే ఓ పవర్​ ఫుల్​ విలన్​.. విలన్​ దెబ్బకు కకావికలమైన కుటుంబం.. ఇన్ని ఉన్నా ఈ జులాయి హీరోనే చివరికి హీరోపై విజయం సాధించి కుటుంబాన్ని ఒకటి చేసేయడం.. ఇదీ 1990–2000లు కాలం నాటి కథలు.. ఇప్పుడు ఇలాంటి రొటీన్​ కథనే వారిసు గా విజయ్​, దిల్​ రాజు, వంశీలు తెరకెక్కించిందని ట్రైలర్​ చూసిన ఫ్యాన్స్​ కామెంట్స్​ పెడుతున్నారు.

ట్యాగ్స్​