వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి తీరుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనూ తామే గెలిచి వరుసగా మూడో సారి కేసీఆర్ సిఎం అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్న ఆయన ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వ హయాంలో అందుతున్నాయని దర్జాగా చెప్పగలమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.