కేసిఆర్​: మా మద్దతు యశ్వంత్ సిన్హా కే

By udayam on June 27th / 5:18 am IST

వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ప్రతిపక్షాల అభ్యర్తి యశ్వంత్​ సిన్హా కే మద్దతిస్తుందని టిఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ సిఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. నేడు యశ్వంత్​ నామినేషన్​ను దాఖలు చేయనున్న నేపధ్​యంలో కేసీఆర్​ ప్రకటన విపక్ష కూటమికి మరింత బలాన్ని చేకూర్చింది. విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. ఆయన కుమారుడు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ట్యాగ్స్​