కెసిఆర్​: టిఆర్​ఎస్​ ఇకపై భారత రాష్ట్ర సమితి

By udayam on October 5th / 9:46 am IST

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలో కూడా అవసరమైన మార్పులు చేసినట్లు ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ట్యాగ్స్​