తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ళతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌పై తెరాస నాయకుడు చేయి చేసుకున్నాడు. జక్కాపూర్ వద్ద జరిగిన ఈ ఘటనలో జిల్లెల్ల గ్రామ తెరాస నాయకుడు అనిల్ రెడ్డి పాల్‌పై చెంపై దెబ్బ కొట్టాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పాల్‌ను సిద్దపేటకు తరలించి అక్కడ నుంచి హైదరాబాద్‌కు పంపించేశారు.