చార్మినార్ భోగివేడుకల్లో ఎమ్మెల్సీ కవిత సందడి

By udayam on January 13th / 5:18 am IST

హైదరాబాద్‌: తెలంగాణలో భోగి పండుగ వేడుకలు సందడిగా మొదలయ్యాయి. పలువురు నాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా చార్మినర్‌ దగ్గర నిర్వహించిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నేడు నిర్వహించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు…

ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుతూ భాగ్యలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాదంతా కరోనాతో ఇబ్బందులు పడ్డామని.. ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని ప్రజలు కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందాలని ఆమె ఆకాంక్షించారు. సంక్రాంతి సిరిసంపదలు ఇచ్చే పండుగ అన్నారు. అందరి జీవితాల్లో సిరిసంపదలు సమృద్ధిగా రావాలని కవిత పేర్కొన్నారు.