టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ఆఫీస్ లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయన్ను హాస్పటల్ కు తరలించారు. కేసినో కేసులో ఎల్.రమణ ను ఈరోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితమే ఈడీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన..వచ్చిన కాసేపట్లోనే అస్వస్ధతకు గురయ్యారు.నేపాల్ లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జూన్ లో బిగ్ డాడీ పేరుతో నేపాల్ లో నిర్వహించిన ఈవెంట్ పై ప్రశ్నిస్తున్నారు.