బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికే టిఆర్​ఎస్​ ఓటు?

By udayam on May 11th / 10:30 am IST

ఈ ఏడాది జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి ప్రకటించే అభ్యర్ధికే టిఆర్​ఎస్​ మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ది న్యూస్​ మినిట్​ రిపోర్ట్​ చేసింది. 2017లోనూ బిజెపి అభ్యర్థి రామ్​నాథ్ కోవింద్​కు టిఆర్​ఎస్​ బలపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సిఎం కేసీఆర్​ వీలు దొరికినప్పుడల్లా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఓ పార్టీ ఏర్పాటుకూ ఆయన సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్​