సాగర్ టీఆర్ఎస్ దే

By udayam on May 2nd / 10:08 am IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం సాధించింది. 21 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి నోముల భగత్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 15,487 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో భగత్‌ 15,487 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 21 రౌండ్ల తర్వాత తెరాసకు 74,726 ఓట్లు, కాంగ్రెస్‌కు 59,239 ఓట్లు, భాజపాకు 6,365 ఓట్లు పోలయ్యాయి. జానారెడ్డి కి రెండో స్థానం దక్కగా.. భాజపా డిపాజిట్‌ కోల్పోయింది.

ట్యాగ్స్​