నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అరవింద్ ఇంటి ఫై దాడి చేసారు. ఆయన ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వసం చేసారు. ఇంట్లో నానా బీబత్సం చేసారు. టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేస్తున్న సమయంలో అరవింద్ ఇంట్లో లేరు.గురువారం అరవింద్ మాట్లాడుతూ.. సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శలు గుప్పించారు. దీనిపై గులాబీ శ్రేణులు రెచ్చిపోయాయి.