టిఆర్ఎస్ గూండాలు తమ ఇంటిని ధ్వంసం చేసి తన తల్లిని బెదిరించారని ఎంపి ధర్మపురి అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో దాదాపు 100 మంది వరకూ వచ్చారన్న ఆయన కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే హైదరాబాద్ లోని తన ఇంటిపై ఈ గూండాలు దాడి చేశారని అన్నారు. ఇంట్లోని వస్తువులను పగులగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, తన తల్లిని బెదిరించారని పేర్కొంటూ శ్రీనివాస్ ట్వీట్ చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ కూడా చేశారు.
కెసిఆర్, KTR, K.కవిత ల ఆదేశాలపై హైదరాబాద్ లోని నా ఇంటిపై దాడి చేసిన TRS గుండాలు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ, బీభత్సం సృష్టిస్తూ, మా అమ్మను బెదిరించారు!
TRS goons attacked my residence and vandalised the house.
They terrorised my mother & created ruckus.@PMOIndia @narendramodi pic.twitter.com/LwtzZU4rfg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) November 18, 2022