ట్రంప్​: ట్విటర్ లోకి వచ్చే ఆశక్తి లేదు

By udayam on November 21st / 9:36 am IST

తన ట్విట్టర్​ ఖాతాపై విధించిన బ్యాన్​ ను ఎత్తేసినా తనకు ఆ సోషల్​ మీడియాలోకి వచ్చే ఆశక్తి ఏమాత్రం లేదంటున్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ట్విట్టర్​ ను ఇటీవలే కొనుగోలు చేసిన ఎలన్​ మస్క్​..ట్రంప్​ ఖాతాను పునరుద్ధరిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పటికే ట్రంప్​.. తన సొంత సోషల్​ మీడియా యాప్​ ట్రూత్​ లో యాక్టివ్​ ఉండడంతో ఇకపై తనకు ట్విట్టర్లోకి వచ్చే ఉద్దేశం లేదంటూ పేర్కొన్నాడు. ‘నా సొంత యాప్​ అద్భుతంగా పనిచేస్తోంది.. దానికే పరిమితమవుతా తప్ప వేరే దానికి వెళ్ళను’ అంటూ పేర్కొన్నాడు.

ట్యాగ్స్​