సిఎన్​ఎన్​పై రూ.3700 కోట్ల పరువు నష్టం దావా వేసిన ట్రంప్​

By udayam on October 4th / 9:52 am IST

తనపై లేనిపోని వార్తలు రాస్తోందని సిఎన్​ఎన్​ వెబ్​సైట్​, పత్రిక, న్యూస్​ ఛానల్​పై అమెరికా మాజీ అధ్యక్షుడు పరువు నష్టం దావా వేశారు. ఏకంగా 475 మిలియన్​ డాలర్లకు (మన రూపాయల్లో రూ.3700 కోట్లకు పైనే) ట్రంప్​ ఈ దవాను ఫ్లోరిడాలోని యూఎస్​ డిస్ట్రిక్ట్​ కోర్ట్​లో ఫైల్​ చేశారు. 2024 ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తాననే భయంతో తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని తన దావాలో పేర్కొన్నారు. తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు.

ట్యాగ్స్​