దళిత బంధుకు రూ.600 కోట్లు

By udayam on September 20th / 7:11 am IST

తెలంగాణ సిఎం కేసీఆర్​ కలల ప్రాజెక్ట్​ దళిత బంధు కోసం సర్కార్​ రూ.600 కోట్లను తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకూ రూ.3,847.6 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లయింది. మొత్తం 38,476 మంది లబ్దిదారుల్లో ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్దిక సాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోంది.

ట్యాగ్స్​