తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్తో ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు ఇప్పటికీ హాల్ టికెట్ తీసుకోనివారు tsbie.cgg.gov.in.వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.