సింగరేణిలో వాటా ఇవ్వలేం : తెలంగాణ

By udayam on January 13th / 5:26 am IST

సింగరేణి కాలెరీస్​లో వాటా కావాలని అడుగుతున్న ఎపి అభ్యర్థనలను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. దాంతో పాటు సింగరేణి కాలరీస్​లో ఎపి హెవీ మెషినరీ ఇంజనీరింగ్​ లిమిటెడ్​కు ఉన్న యాజమాన్య హక్కులను సైతం చెల్లవని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంపై తేల్చాల్సిన లెక్కలపై కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విషయాలపై తెలంగాణ తేల్చి చెప్పేసింది. ఎపికి వాటా ఇవ్వడంపై కేంద్రం కూడా తమకే మద్దతు ఇవ్వాలని తెలంగాణ డిమాండ్​ చేసింది.

ట్యాగ్స్​